Major fire breaks out in Hyderabad copper recycling unit, causing a loss of ₹1 crore; fire crew contains flames with swift action.

హైదరాబాద్ కాపర్ యూనిట్‌లో అగ్నిప్రమాదం, కోటి నష్టం

హైదరాబాద్ నగరంలోని ప్రశాంతినగర్‌లో ఉన్న ఓ కాపర్ రీసైక్లింగ్ యూనిట్‌లో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్న వేళ స్థానికులు అప్రమత్తమై వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. మూడు ఫైరింజన్లు, పది వాటర్ ట్యాంకర్లతో మంటలను శాంతింపజేయడానికి గంటల పాటు శ్రమించారు. అగ్నిమాపక సిబ్బంది సమయానికి స్పందించడంతో మరింత ప్రాణ నష్టం లేకుండా నిరోధించగలిగారు. అధికారులు ఘటనా స్థలంలో బేఖాతర్ చర్యలు తీసుకున్నారు….

Read More
Telangana High Court confirms death sentence for 5 convicts in the Dilsukhnagar blasts case, upholding the 2016 NIA court verdict.

ఐదుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసిన హైకోర్టు

2013లో హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ పేలుళ్లలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, 130 మందికిపైగా గాయపడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురికి 2016 డిసెంబర్‌ 13న NIA కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పును తోసిపుచ్చాలని కోరుతూ దోషులు తెలంగాణ హైకోర్టులో అప్పీల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కే లక్ష్మణ్‌,…

Read More
A speeding truck rammed into traffic constables near Miyapur Metro, killing one and injuring two others late Monday night.

మియాపూర్‌లో లారీ బీభత్సం… కానిస్టేబుల్ మృతి…

హైదరాబాద్‌ మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ నియంత్రణలో ఉన్న కానిస్టేబుళ్లపైకి ఓ లారీ దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. లారీ కూకట్‌పల్లిలో బియ్యం బస్తాలు దిగబెట్టి మియాపూర్ వైపు వస్తుండగా… పిల్లర్ నంబర్ 600 వద్ద ట్రాఫిక్ బూత్‌ను ఢీకొట్టింది. అప్పట్లో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు సింహాచలం, రాజవర్ధన్, విజేందర్ లారీ ఢీకొట్టడంతో…

Read More
Youth creating a gun stunt in an open-top jeep were arrested in Banjara Hills. The viral video led to a suo-moto case by the police.

బంజారాహిల్స్‌లో తుపాకీతో హల్‌చల్ చేసిన యువకులు అరెస్ట్!

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో తుపాకీతో హల్‌చల్ చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్థరాత్రి ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ, డ్యాష్‌బోర్డుపై తుపాకీ ఉంచి, గాల్లోకి ఊపుతూ ప్రజలను భయపెట్టారు. ఈ సంఘటన నగర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ యువకులు స్వయంగా ఈ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో వైరల్ కావడంతో బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడిగా అఫ్సర్ అనే యువకుడిని గుర్తించి, అతడిని…

Read More
A woman traveling alone in a local train was attacked. She jumped off to escape and sustained injuries. Police registered a case.

లోకల్ ట్రైన్‌లో యువతిపై దాడి – రైలు నుంచి దూకి గాయాలు

హైదరాబాద్‌లో లోకల్ ట్రైన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా ప్రయాణిస్తున్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. అతని నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు రైలు నుంచి దూకి తీవ్ర గాయాలపాలైంది. అనంతపురం జిల్లాకు చెందిన బాధితురాలు మేడ్చల్‌లోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తన సెల్‌ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ వెళ్లిన ఆమె తిరిగి లోకల్ ట్రైన్‌లో వెళ్తుండగా, మహిళా బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్‌లో దిగిపోయారు. ఆ తర్వాత…

Read More
Air India passengers protest at Hyderabad Airport due to flight delay, leading to chaos at the terminal.

శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన

హైద‌రాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం గందరగోళం నెలకొంది. హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరుకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఆల‌స్యం కావ‌డంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శ్రీన‌గ‌ర్ నుంచి రావాల్సిన ఫ్లైట్‌ అనుకున్న సమయానికి రన్‌వేపైకి రాకపోవడంతో ప్రయాణికులు గంట‌ల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఫ్లైట్ ఆల‌స్యం గురించి ఎయిరిండియా ప్ర‌తినిధులను ప్రయాణికులు ప్రశ్నించగా, వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఉద్రిక్తత పెరిగింది. ముందుగా ఆల‌స్యం గురించి తెలియజేయకుండా బోర్డింగ్‌ను ఎందుకు ప్ర‌క‌టించార‌నే విషయంపై…

Read More
Miss World 2024 will be held in Hyderabad from May 7, with the government spending ₹27 crore through sponsorships.

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు – 27 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం

హైదరాబాద్‌లో మే 7 నుంచి 24 రోజుల పాటు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు, మే 31న హైటెక్స్‌లో ఫైనల్ పోటీలు నిర్వహిస్తారు. మొత్తం 140 దేశాల నుంచి అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ మెగా ఈవెంట్ నిర్వహణ కోసం రూ. 54 కోట్లు ఖర్చు కానుండగా, ప్రభుత్వం స్పాన్సర్ల సహాయంతో రూ. 27 కోట్లు వెచ్చించనుంది. మిగతా రూ. 27 కోట్లను మిస్ వరల్డ్ సంస్థ ఖర్చు…

Read More