ఫిలింనగర్ ఆకాష్ ఇన్స్టిట్యూట్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆకాష్ ఇన్స్టిట్యూట్‌లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఇన్స్టిట్యూట్‌లో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. మంటలు కింద ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ షోరూమ్‌కు వ్యాపించాయి, అయితే పెద్ద నష్టం జరగలేదు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.సంఘటన స్థలానికి చేరుకున్న మూడు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి. పక్కనే ఉన్న డీమార్ట్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి…
