
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ ఆలస్యం కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానం ఆలస్యమవ్వడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన విమానం మూడు గంటలపాటు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలస్యానికి సరైన సమాచారం అందించలేదని విమానయాన సంస్థపై మండిపడ్డారు. విమానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణం ఆలస్యమైందని స్పైస్‌జెట్ సిబ్బంది వెల్లడించారు. అయితే, ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం తమను తీవ్ర అసహనానికి గురిచేసిందని ప్రయాణికులు ఆరోపించారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు….