
ఉట్నూర్‌లో గిరిజన పోషణ మిత్ర కార్యక్రమం ప్రారంభం
ఉట్నూర్ మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో గిరిజన పోషణ మిత్ర కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ దండె విట్టల్ కూడా హాజరయ్యారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు. డీఎస్సీలను వేయడం ద్వారా విద్యార్ధులకు నూతన అవకాశాలు అందిస్తున్నామన్నారు. పోటీ యుగంలో విద్యార్థులు సమర్థంగా పోటీలో నిలబడాలని మంత్రి పేర్కొన్నారు. టీచర్లకు గరిష్ట నైపుణ్యాలను అందించాలని, వారు పిల్లలకు…