
బరంపూర్ గుట్ట బ్రహ్మోత్సవాల్లో భక్తి ఘనోత్సవం
అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవ విగ్రహాలను భక్తులు ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. రంగురంగుల విద్యుత్ దీపాల కాంతుల్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. వేలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామి నామస్మరణతో గుట్టను మార్మోగించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయడం విశేషం. ముగింపు వేడుకల్లో అన్నమయ్య లడ్డువెం…