
బరంపూర్ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా
అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ దేవి-భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాన అర్చకులు స్వస్తిక్, వేణుగోపాల శర్మ, నేరెళ్ల కళ్యాణ్ వేద మంత్రోచ్ఛారణల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో వరుడు తరపున బరంపూర్ వాస్తవ్యులు మెరుగు మోహన్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వధువు తరపున…