
తెలంగాణ అటవీ ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లకు గ్రీన్ సిగ్నల్ – 24 గంటల్లో అనుమతులు
హైదరాబాద్, అక్టోబర్ 16:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు, పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలనే లక్ష్యంతో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణలకు అధికారిక అనుమతులు లభించనున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ‘ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ’ సింగిల్ విండో వెబ్‌సైట్ ద్వారా చిత్ర నిర్మాతలు కేవలం 24 గంటల్లో అనుమతి పొందగలుగుతారు. అడవుల్లో షూటింగ్‌కి ఆహ్వానం: తెలంగాణ అటవీ శాఖ సినీ పరిశ్రమ వర్గాలతో చర్చించి సుమారు…