ప్రతి ఇంటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్ ఉండాలి – చంద్రబాబు
రాష్ట్రంలో ప్రతి ఇంటిలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన ప్రకటన ప్రకారం, ఏఐని రాష్ట్రంలో విస్తృతంగా ప్రోత్సహించి, ప్రతి ఇంటిలోనూ దీనిని ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ సేవలు మెరుగుపడతాయని, ప్రజలకు మంచి సేవలు అందించగలుగుతామని చెప్పారు. సచివాలయంలో సోమవారం జరిగిన ఆర్టీజీఎస్ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఐటీ రంగాన్ని మనం సొంతం చేసుకున్నట్లే, ఇప్పుడు ఏఐని ఉపయోగించి అద్భుతమైన ఫలితాలను…
