ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి తైవాన్ తో నారా లోకేష్ చర్చలు
ఏపీలో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాల అభివృద్ధికి తైవాన్ సహాయ సహకారాలు అందించాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఉండవల్లి నివాసంలో తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్, తైవాన్ పరిశ్రమల ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ రంగాల్లో తైవాన్ అనుసరిస్తున్న విధానాలు, పాలసీలను అధ్యయనం చేయాలని లోకేష్ కోరారు. ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహక చర్యలు తీసుకుంటుందని లోకేష్ వివరించారు. 2014-19 కాలంలో…
