బెట్టింగ్ యాప్‌లపై సజ్జనార్ కఠిన హెచ్చరిక!
బెట్టింగ్ యాప్‌లు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. క్షణికావేశంతో డబ్బు సంపాదించాలనే ఆశతో ఎంతో మంది బెట్టింగ్ బారినపడిపోతున్నారని, చివరకు అప్పుల పాలై ఆత్మహత్యల బాట పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించే యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బు కోసం బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారని సజ్జనార్ మండిపడ్డారు. అమాయక ప్రజలు దీనికి…
