వాడరేవు-పిడుగురాళ్ల హైవే నిర్మాణానికి వేగం
ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన వాడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారి (167ఏ) నిర్మాణం త్వరితగతిన సాగుతోంది. ఈ హైవే మొత్తం రూ.1,064.24 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉంది. బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల మీదుగా ప్రయాణించే ఈ రహదారి ఈ ఏడాది చివర్లో పూర్తవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. పర్యాటకాభివృద్ధి, రవాణా వేగవంతం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. వాడరేవు నుంచి కారంచేడు, పర్చూరు, చిలకలూరిపేట, నరసరావుపేట మీదుగా పిడుగురాళ్ల దగ్గర నకరికల్లు అడ్డరోడ్డు వరకు ఈ హైవే నిర్మాణం కొనసాగుతోంది. ఈ…
