రూ.2000 నోట్లలో ఇంకా రూ.6,266 కోట్లు ప్రజల వద్ద
రూ.2000 నోట్లను ఆర్బీఐ ఉపసంహరించినట్లు ప్రకటించి దాదాపు రెండేళ్లు కావస్తున్నా, ఇంకా చాలా వరకు ఈ నోట్లు ప్రజల వద్దే ఉన్నట్లు తేలింది. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం, ఏప్రిల్ 30, 2025 నాటికి రూ.6,266 కోట్ల విలువైన రూ.2000 నోట్లు బ్యాంకులకు తిరిగి రాలేదని వెల్లడించింది. ఇది మొత్తం చలామణిలో ఉన్న నోట్లలో 1.76 శాతమే అయినప్పటికీ, ఇది గణనీయమైన మొత్తం కావడం గమనార్హం. 2023 మే 19న ఆర్బీఐ ఈ నోట్లను చలామణి నుంచి…
