సరికొత్త 150 రోజుల ప్ల్యాన్లతో మీ BSNL

ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) ఇటీవల మొబైల్ టారిఫ్‌ రేట్లను గణనీయంగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వరంగ ఆపరేటర్ అయిన బీఎస్ఎన్ఎల్ వైపు కస్టమర్లు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్‌లోకి పోర్ట్ అయ్యారంటూ కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఇక మరింత మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీ ఆకర్షణీయమైన ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు రూపొందించిన ప్లాన్‌లో ఒక ఆఫర్ ఆకర్షణీయంగా ఉంది….

Read More

రిలయన్స్ జియో: సెట్ టాప్ బాక్స్ లేకుండా 800 ఛానళ్లు

సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుండా వినియోగదారులు 800 చానళ్లు చూసే అవకాశం కల్పిస్తొంది ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. జియో తన టీవీ ప్లస్ సేవలను విస్తృతం చేసింది. ఇటీవలి వరకూ జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్లు తీసుకున్న వినియోగదారులకు సెట్ టాప్ బాక్స్ లో ఈ యాప్ అందుబాటులో ఉండేది. అయితే ఇకపై ఆండ్రాయిడ్, యాపిల్, అమెజాన్ ఫైర్ ఓస్ లోనూ జియో టీవీ ప్లస్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది….

Read More

లాభాల్లో భారత మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ సానుకూల సెంటిమెంట్‌తో సూచీలు రోజంతా లాభాల్లోనే కనిపించాయి. సెన్సెక్స్ 378 పాయింట్లు లేదా 0.47 శాతం ఎగిసి 80,802 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 126 పాయింట్లు లాభపడి 24,698 పాయింట్ల వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్ స్టాక్స్ అదరగొట్టాయి. నిఫ్టీ బ్యాంక్ 434 పాయింట్లు లాభపడి 50,803 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్-30లో బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టెక్ మహీంద్రా, బజాజ్…

Read More

భారత మార్కెట్‌లో బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్

భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ ను భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో అమ్ముడవుతున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 కి పోటీగా తీసుకొచ్చింది. బ్రిటన్ కు చెందిన బర్మింగ్ హామ్ స్మాల్ ఆర్మ్స్ (బీఎస్ఏ) కంపెనీ తన గోల్డ్ స్టార్ బైక్ రీమోడల్ ను ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. యూకే, యూరప్ లలో 2021 నుంచే అమ్ముతోంది….

Read More

ఓలా స్కూటర్ సమస్య: వినియోగదారుడు నిరసనగా పాట పాడిన వీడియో వైరల్

ఓలాకి చెందిన ఎలక్ట్రిక్ స్కూట‌ర్లు త‌ర‌చూ మొరాయిస్తున్న‌ట్లు ఇటీవ‌ల నెట్టింట ఫిర్యాదులు వ‌స్తున్నాయి. తాజాగా ఇలాగే ఓ ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్‌కు ఇటీవల వాహ‌నం బాగా ఇబ్బంది పెడుతోంది. దాంతో కంపెనీ షోరూమ్ వెలుపల తన స్కూటర్‌కు మాక్ అంత్యక్రియలు నిర్వహించి, కంపెనీ పేలవమైన విక్రయానంతర సేవల‌పై త‌న నిరాశను ఎత్తిచూపారు.  సాగ‌ర్ సింగ్ అనే వ్య‌క్తి ఆగిపోయిన త‌న ఓలా స్కూట‌ర్‌ను రిక్షాపై తీసుకొచ్చి ఓలా షోరూమ్ ముందు ఉంచి, బాలీవుడ్ పాట ‘తడప్ తడప్స…

Read More

73 లక్షల మొబైల్ కనెక్షన్లను రీవెరిఫికేషన్లో విఫలమై టెలికం కంపెనీలు రద్దు చేశాయి: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌ల‌మైన 73 ల‌క్ష‌ల మొబైల్ క‌నెక్ష‌న్ల‌ను టెలికం కంపెనీలు ర‌ద్దు చేసిన‌ట్లు బుధ‌వారం లోక్‌స‌భ‌లో కేంద్ర స‌హాయ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు. ఆయా మొబైల్ క‌నెక్ష‌న్ల‌ను రీవెరిఫై చేయాలాని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేష‌న్ (డాట్‌) టెల్కోల‌ను ఆదేశించింది.  వివ‌రాల ధృవీక‌ర‌ణలో విఫ‌ల‌మైన కంపెనీలు, కనెక్ష‌న్ల‌ను ర‌ద్దు చేశాయి. న‌కిలీ ఐడీలు లేదా అడ్ర‌స్‌ల‌తో త‌ప్పుడు కనెక్ష‌న్లు పొందిన వారిని గుర్తించేందుకు డాట్ ఒక వ్య‌వ‌స్థ‌ని రూపొందించిన‌ట్లు ఈ సంద‌ర్భంగా కేంద్రం వెల్ల‌డించింది.  “ఇప్పటి వరకు…

Read More