ఇస్రో డిసెంబర్ లో రెండు రాకెట్ ప్రయోగాలను చేపట్టనుంది
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వరుస విజయాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నెల డిసెంబర్‌లో ఇస్రో రెండు కీలక రాకెట్ ప్రయోగాలను చేపట్టేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 4న పీఎస్ఎల్వీ సీ59 రాకెట్(PSLV-C59), డిసెంబర్ 24న పీఎస్ఎల్వీ సీ60 రాకెట్ (PSLV-C60) ప్రయోగాలను చేపట్టేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం శ్రీహరికోట షార్ లోని ప్రయోగ వేదిక వద్ద పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ అనుసంధానం పనులు జరుగుతున్నాయి. అంతేకాకుండా, పీఎస్ఎల్వీ సీ60 రాకెట్‌ను…
