కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రచారం: స్వదేశీ నావిగేషన్ యాప్ ‘మ్యాపుల్స్’
ప్రపంచవ్యాప్తంగా విరివిగా ఉపయోగించే గూగుల్ మ్యాప్స్‌కు గట్టి పోటీనిచ్చేలా భారతదేశం రూపొందించిన స్వదేశీ నావిగేషన్ యాప్ ‘మ్యాపుల్స్’ (Mappls) కు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మద్దతుగా నిలిచారు. గూగుల్ మ్యాప్స్ కన్నా మెరుగైన ఫీచర్లతో పనిచేసే ఈ యాప్ ప్రయాణాన్ని సులభతరం చేస్తోందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉపయోగించాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా తన కారులో ‘మ్యాపుల్స్’ యాప్ ఉపయోగిస్తున్న…
