అంతర్జాతీయ క్రికెట్ యవనికపైనా తనదైన ముద్ర వేసేందుకు జై షా సిద్ధమ

జై షా ఐసీసీ చైర్మన్ గా ఏకగ్రీవ ఎన్నిక

భారత క్రికెట్ రంగంలోనే కాదు, అంతర్జాతీయ క్రికెట్ యవనికపైనా తనదైన ముద్ర వేసేందుకు జై షా సిద్ధమయ్యారు. జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా గ్రెగ్ బార్ క్లే కొనసాగుతుండగా, ఆయన ఈ ఏడాది డిసెంబరులో పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం జై షా ఐసీసీ పగ్గాలు అందుకోనున్నారు.  జై షా 2019 నుంచి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2021 నుంచి ఆసియా…

Read More
Indian lady cricket team 2024

టీ20 మహిళల వరల్డ్ కప్‌ 2024: భారత జట్టు ప్రకట

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2024కు బీసీసీఐ తాజాగా భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో టీమిండియా ఈ మెగా ఈవెంట్‌లో బ‌రిలోకి దిగ‌నుంది. ఈ జ‌ట్టుకు వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధానను ఎంపిక చేసింది బోర్డు.   షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ల‌తో భార‌త‌ బ్యాటింగ్ లైనప్ బ‌లంగా ఉంది. రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, రాధా…

Read More

యూట్యూబ్‌లో క్రిస్టియానో రొనాల్డో రికార్డు

పోర్చుగల్ సాక‌ర్ లెజెండరీ ఆట‌గాడు క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టించాడు. ఈ సాక‌ర్ వీరుడు బుధవారం యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. అయితే ఈ ఛానెల్‌కు ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. కేవలం 90 నిమిషాల్లోనే 10 లక్షల మంది రొనాల్డో ఛానెల్‌ను సబ్‌ స్క్రయిబ్ చేసుకున్నారు. దీంతో అతి తక్కువ సమయంలో 1 మిలియన్ సబ్‌స్క్రైబర్లను సాధించిన తొలి వ్యక్తిగా నిలిచాడు. ఈ మాజీ రియల్ మాడ్రిడ్ లెజెండ్ ఇప్పుడు 11 మిలియన్ కంటే ఎక్కువ…

Read More

రోహిత్ శర్మకు ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ఇయర్ అవార్డు

భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన అవార్డు అందుకున్నాడు. ప్రముఖ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ సియట్‌ క్రికెట్ రేటింగ్స్ అవార్డ్స్ 2024లో ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ఇయర్ పుర‌స్కారం దక్కించున్నాడు. సియట్ 26వ ఎడిషన్ అవార్డ్స్ వేడుక‌ ముంబైలో బుధవారం ఘ‌నంగా జరిగింది.  ఇక ఈ ఏడాది వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఐసీసీ టీ20 ప్రపంచ‌క‌ప్‌ను రోహిత్ శ‌ర్మ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే. జూన్…

Read More

మను బాకర్ చెన్నై స్కూల్ ఈవెంట్‌లో స్టేజీపై డ్యాన్స్!

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత షూటర్‌ మను బాకర్‌ అద్భుత ప్రదర్శనతో రెండు కాంస్య పతకాలు సాధించిన విష‌యం తెలిసిందే. దీంతో ఒకే ఒలింపిక్స్ లో రెండు ప‌త‌కాలు సాధించిన తొలి భార‌త అథ్లెట్‌గా రికార్డుకెక్కింది. ఈ యంగ్‌ షూటర్‌ తాజాగా త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో సందడి చేసింది.  ఓ స్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన ఆమె.. అక్క‌డ ఏర్పాటు చేసిన‌ స్టేజీపై డ్యాన్స్ చేసి విద్యార్థుల‌ను ఉత్సాహ‌ప‌రిచింది. బాలీవుడ్ సాంగ్‌ ‘కాలా చష్మా’కు అక్కడి…

Read More

ధోనీ నేటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలు

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్‌ ధోనీ ప్ర‌స్తుతం త‌న విలువైన సమయాన్ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో గడుపుతున్నాడు. ధోనీ 2020లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఐపీఎల్‌లో మాత్ర‌మే ఆడుతున్నాడు.  తాజాగా ధోనీ తన స్నేహితుల‌తో క‌లిసి చిల్‌ అవుతున్న ఫొటోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాంచీలోని ఓ లోకల్‌ ధాబాలో తన మిత్రుల‌తో కలిసి లంచ్‌ను ఎంజాయ్‌ చేశారు. వారితో సరదాగా కాసేపు ముచ్చటించి…

Read More

యూవీ రికార్డు బద్దలుకొట్టిన సమోవా క్రికెటర్

ఐసీసీ మెగా టోర్నీ టీ20 ప్రపంచ కప్‌-2026 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న క్వాలిఫయర్‌ టోర్నీలో తాజాగా ఓ అరుదైన రికార్డు న‌మోదైంది. 28 ఏళ్ల‌ అనామక ఆట‌గాడు భారత స్టార్ క్రికెట‌ర్‌ యూవరాజ్ సింగ్ 17 ఏళ్ల రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు బాదడం ద్వారా ఒకే ఓవర్లో 36 పరుగులు సాధించాడు. ఇప్పుడా రికార్డును సమోవా దేశ ఆటగాడు డేనియల్ విస్సెర్ బద్దలుకొట్టాడు. విస్సెర్ ఒకే…

Read More