
మంగోలియా టీ20లో 10 పరుగులకే ఆలౌట్
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో తాజాగా సంచలనం నమోదైంది. బాంగీలో జరిగిన టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫైయర్-ఏలో మంగోలియా జట్టు 10 పరుగులకే ఆలౌట్ అయింది. సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఇలా తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. దీంతో పురుషుల టీ20లో అత్యల్ప స్కోరును సమం చేసింది. గతేడాది స్పెయిన్‌పై ఐల్ ఆఫ్ మ్యాన్ కూడా ఇలాగే పది పరుగులకే కుప్పకూలింది. దాంతో ఇప్పుడు ఆ అత్యత్ప స్కోర్ రికార్డు సమం అయింది. ఇక మంగోలియా ఇన్నింగ్స్‌లో…