
భారత్ భారీ విజయం, 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది
పెర్త్ టెస్టులో భారత్ బోణి అదిరిపోయింది. ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో ఓడించి, ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 534 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలనుకున్న ఆస్ట్రేలియా, 238 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ విజయంతో భారత జట్టు గొప్ప ఆధిపత్యాన్ని చెలాయించింది. ఆస్ట్రేలియా గడ్డపై 534 పరుగుల లక్ష్యఛేదన సాధ్యం కాదనుకున్నా, వారు కనీసం డ్రా కొరకు పోరాడుతారని ఊహించారు. కానీ, భారత్ బౌలర్లు చుక్కలు చూపించారు. నాథన్ మెక్‌స్వీనీ, ఉస్మాన్ ఖవాజా, పాట్…