
సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్ గాయం, భారత్ కష్టాల్లో
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత బ్యాటర్ రిషభ్ పంత్ గాయపడ్డాడు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ విసిరిన బంతి పంత్ మోచేతి పైభాగంలో తగలడంతో వెంటనే వాపు వచ్చింది. ఆ నొప్పితో పంత్ విలవిలలాడాడు. వెంటనే సిబ్బంది వచ్చి చికిత్స అందించగా, పంత్ మళ్లీ ఆటను కొనసాగించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 72 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్…