ఉచిత మెగా వైద్య శిబిరం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి హాజరయ్యారు,ఈ ప్రభుత్వంలో యన్టీఆర్ ఆరోగ్య శ్రీ గా పేదలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తోందని ఆయన తెలిపారు.

ఉచిత మెగా వైద్య శిబిరంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అతిథిగా హాజరయ్యారు

కర్నూలు జిల్లా, కోసిగి మండలం కర్నూలు ఆర్ ఆర్ హాస్పిటల్, సౌజన్యంతో స్థానిక మౌంట్ కార్మెల్ స్కూల్లో పాదర్స్ జోజి, బాల ఏసు నేతృత్వంలో ఆర్ ఆర్ హాస్పిటల్,కర్నూలు సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి, మండల ఇంచార్జీ శ్రీ పి మురళీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మాట్లాడుతూ,ఆరోగ్య శ్రీ సృష్టికర్త,దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ వైయస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్య…

Read More

రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద ధర్నా

ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీకి వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ అధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర సంస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకొని కొందరికి మాత్రమే లబ్ధి చేకూరేలా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా అదానీకి లబ్ధి చేకూరుస్తున్నారని, దీనిని నిరసిస్తూ దేశంలోని అన్ని ఈడీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ గురువారం ఆందళనలు నిర్వహించింది. ఇందులో…

Read More

అనకాపల్లి పేలుడుపై ప్రధాని మోదీ సంతాపం

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనలో 17 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా తన సంతాపాన్ని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. “అనకాపల్లిలోని…

Read More

రేవంత్‌రెడ్డిపై పరువు నష్టం కేసు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై పరువు నష్టం కేసు నమోదైంది. మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమపై అబద్ధాలు ప్రచారం చేశారంటూ బీజేపీ పరువు నష్టం దావా వేసింది. దీనిపై హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు సీఎంకు నోటీసులు పంపింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుందంటూ రేవంత్‌రెడ్డి అబద్ధాలు ప్రచారం చేశారని బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఈ ప్రచారంలో నిజం లేనప్పటికీ ప్రజల్లో పార్టీపై అపనమ్మకం, గందరగోళం ఏర్పడ్డాయని పేర్కొన్నారు. మే…

Read More

స్వచ్ఛ బయో ఒప్పందంపై బీఆర్ఎస్ ఆరోపణలు

అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం స్వచ్ఛ బయో సంస్థతో రూ.1000 కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ డీల్ వెనుక పరస్పర ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్… ఈడీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడిపై ప్రతిపక్ష పార్టీ ఆరోపణలను గుప్పించింది. స్వచ్ఛ బయో, ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందంపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ తెలిపిన…

Read More

సీఎం చంద్రబాబు పంచాయతీ సమీక్ష: వ్యయం పెంపు, కొత్త యాప్

సీఎం చంద్రబాబు నేడు పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.  గ్రామ పంచాయతీలకు స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వ్యయం పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. వేడుకల వ్యయాన్ని రూ.10 వేల నుంచి 25 వేలకు పెంచినట్టు సమీక్షలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకువచ్చారు. మొబైల్ యాప్…

Read More

హోంమంత్రి అనిత విశాఖలో సమీక్ష: గంజాయి నివారణ, పోలీసుల సంక్షేమంపై వ్యాఖ్యలు

రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణ, ఇతర అంశాలపై హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీలతో విశాఖలో నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూచ గంజాయి నివారణపై మంత్రివర్గ ఉపసంఘం నియమించినట్టు వెల్లడించారు.  ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై సీసీ కెమెరాలతో నిఘా వేస్తామని చెప్పారు. గంజాయిని కట్టడి చేసేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అనిత పేర్కొన్నారు. డ్రగ్స్ సేవించినట్టు నిర్ధారించే పరికరాలు అందుబాటులో లేవని, గత ఐదేళ్లలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం…

Read More