ఏఐసీసీ ప్రకటన మేరకు మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రేవంత్ రెడ్డి పదవీకాలం ముగిసిన అనంతరం ఆయన నియామకం జరిగింది.

మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియామకం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవీకాలం గత జులై 7వ తేదీతో ముగిసింది. దీంతో ఆయన స్థానంలో అధ్యక్ష పదవికి పలువురు సీనియర్ నేతలు పోటీ పడ్డారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడ్డారు. అధిష్ఠానం మహేశ్…

Read More
చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడు వైసీపీ నేత జోగి రమేశ్ కోసం ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో గాలిస్తున్నారు.

అజ్ఞాతంలో జోగి రమేశ్… పోలీసుల గాలింపు కొనసాగుతుంది.

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.  ఈ నేపథ్యంలో, జోగి రమేశ్ తో పాటు ఆయన అనుచరుల కోసం ఏపీ పోలీసులు హైదరాబాదులో గాలిస్తున్నారు. జోగి రమేశ్ కోసం ఏపీ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.  అటు,…

Read More

తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై విమర్శలు

కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండి ఏం పీకాడని మేమూ అడగగలమని, కానీ తమకు సంస్కారం అడ్డు వస్తోందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సూచించింది. కేటీఆర్, హరీశ్ రావు తమ సోషల్ మీడియాను అదుపులో పెట్టుకోవాలని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించింది. ఈ మేరకు ‘తెలంగాణ కాంగ్రెస్’ ఎక్స్ హ్యాండిల్ వేదికగా ట్వీట్ చేసింది. “అన్నీ మేమే చేస్తే నువ్వు ఏం పీకుతావ్ రేవంతూ⁉️” అని బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా ప్రశ్నించింది. దీనిని…

Read More
ప‌వ‌న్ క‌ల్యాణ్, సీఎం చంద్ర‌బాబుపై డ్రోన్ల సాయంతో వరద బాధితులకు ఆహారం అందించినందుకు ప్రశంసలు.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ డ్రోన్ల సాయంపై సీఎం చంద్ర‌బాబుకు స‌న్నాహాలు

భారీ వ‌ర‌ద‌లు తెలుగు రాష్ట్రాల‌ను వ‌ణికించిన విష‌యం తెలిసిందే. దీంతో వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వాలు స‌హాయ చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశాయి. ముఖ్యంగా ఏపీలో సీఎం చంద్ర‌బాబు నాయుడు స్వ‌యంగా స‌హాయ‌క చ‌ర్యల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించ‌డం, నేరుగా వ‌ర‌ద‌ బాధితుల వ‌ద్ద‌కు వెళ్లి వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకోవ‌డం ప్రత్యేకంగా నిలిచింది. బాధితులు ప‌స్తులు ఉండ‌కుండా డ్రోన్ల‌ను ఉప‌యోగించి ఆహారాన్ని అందించారు.  ఇలా డ్రోన్ స‌హాయంతో వ‌ర‌ద బాధితుల‌కు ఆహారాన్ని అందించిన ఫొటోల‌ను డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

Read More
అభయ సమయంలో అంబులెన్స్ సిబ్బంది మహిళపై లైంగిక వేధింపులు. రోగిని రోడ్డుపైనే విడిచిపెట్టి, ఆక్సిజన్ లేని కారణంగా మరణం.

ఉత్తరప్రదేశ్‌లో అంబులెన్స్ సిబ్బందిపై లైంగిక వేధింపులు

అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే అంబులెన్స్ సిబ్బందే ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఓవైపు అంబులెన్స్ వెనక సీట్లో రోగి ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. ముందుసీట్లో ఆ రోగి భార్యను వేధించారు. భర్త ఆరోగ్యంపై ఆందోళనతో ఉందనే జాలి కూడా లేకుండా మానవత్వం మరిచి ఈ దుర్మార్గానికి తలపడ్డారు. అంబులెన్స్ డ్రైవర్, అతడి సహాయకుడి వేధింపులను అడ్డుకోవడంతో నడి రోడ్డుపైనే రోగిని దించేసి వెళ్లిపోయారు. పోలీసులకు ఫోన్ చేసి భర్తను వేరే ఆసుపత్రికి తరలించుకునే ప్రయత్నం…

Read More
ఏపీలో పింఛన్ల పంపిణీకి 1.34లక్షల కొత్త ఫింగర్‌ప్రింట్ స్కానర్ల కొనుగోలు. సెక్యూరిటీ సవాల్లకు పరిష్కారం.

ఏపీలో పింఛన్ల పంపిణీలో కొత్త ఫింగర్‌ప్రింట్ స్కాన‌ర్లు

పింఛ‌న్ల పంపిణీలో కీల‌క మార్పు దిశ‌గా ఏపీలోని కూట‌మి స‌ర్కార్ అడుగులేస్తోంది. ఈ మేర‌కు తాజాగా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త కొంత‌కాలంగా సామాజిక పింఛ‌న్ల పంపిణీలో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌కలకు ఆస్కారం లేకుండా స‌రికొత్త ప‌ద్ద‌తితో ముందుకు వ‌స్తోంది.  దీనిలో భాగంగా ప్ర‌భుత్వం అత్యాధునిక ఎల్ ఆర్‌డీ (రిజిస్ట‌ర్డ్‌) ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ల‌ను కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించింది. దీనికోసం రూ. 53కోట్ల‌ను గ్రామ‌, వార్డు స‌చివాల‌య శాఖకు కేటాయించింది. దీంతో ఏపీ స‌ర్వీసెస్ టెక్నాల‌జీ ద్వారా డివైజ్‌ల…

Read More
సుప్రీంకోర్టు, వివాదాస్పద అధికారికి పదవి కట్టబెట్టాలని చూసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఉత్తరాఖండ్ సీఎం ధామిపై సుప్రీం ఆగ్రహం

వివాదాస్పద అధికారికి ఉన్నత పదవి కట్టబెట్టే ప్రయత్నం చేసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఏం చేసినా చెల్లుతుందని అనుకోవద్దని, సీఎం అంటే రాజు కాదని హితవు చెప్పింది. ఈమేరకు బుధవారం ఓ పిటిషన్ విచారణలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ల బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్ కు చెందిన ఐఏఎఫ్ ఆఫీసర్ ఒకరికి రాజాజీ…

Read More