
బలూచిస్థాన్‌లో సైన్యం భారీ దాడులు – జెహ్రీ ప్రజలు భయాందోళన
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ రాష్ట్రం మరోసారి సైనిక చర్యలతో హోరెత్తుతోంది. ముఖ్యంగా కుజ్దార్ జిల్లా జెహ్రీ ప్రాంతంలో నాలుగు రోజులుగా జరుగుతున్న పాక్ ఆర్మీ భారీ ఆపరేషన్ స్థానికులను చిగురుటాకులా వణికిస్తోంది. మానవహక్కుల ఉల్లంఘనల ఆరోపణల నడుమ, ప్రజలపై ప్రయోగిస్తున్న ఆయుధాలు, డ్రోన్ దాడులతో పరిస్థితి మరింత విషమంగా మారింది. దాడులతో దళం దూకుడు: పాక్ సైన్యం జెహ్రీలో డ్రోన్లు, మోర్టార్లు, శతఘ్నులు వాడుతూ విరుచుకుపడుతోంది. ఈ దాడుల లక్ష్యం బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA), బలోచిస్థాన్ లిబరేషన్…