రూ.10వేల పందెం.. మద్యం తాగి ప్రాణాలు కోల్పోయాడు
కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలోని ములబాగిల్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి పందెం కాసిన ఓ యువకుడు, మద్యం తాగిన తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. 21 ఏళ్ల కార్తీక్ అనే యువకుడు ఐదు సీసాల మద్యం నీరు కలపకుండా తాగగలడని చెబుతూ స్నేహితులతో పందెం కాసాడు. ఈ పందెంలో గెలిస్తే రూ.10 వేలు ఇస్తానని వెంకటరెడ్డి అనే స్నేహితుడు కార్తీక్‌ను సవాలు చేశాడు. సవాలును అంగీకరించిన కార్తీక్, వెంటనే ఐదు సీసాల మద్యం…
