 
        
            భర్తను కోల్పోయినా శాంతి కోరిన హిమాన్షి
పహల్గామ్ ఉగ్రదాడిలో తన భర్త, నేవీ అధికారి వినయ్ నర్వాల్‌ను కోల్పోయిన హిమాన్షి నర్వాల్ ఓ ఉదాత్తమైన సందేశాన్ని సమాజానికి ఇచ్చారు. భర్త స్మారకార్థం నిర్వహించిన రక్తదాన శిబిరానికి హాజరైన ఆమె, మీడియాతో మాట్లాడుతూ — తనకు ముస్లింలపై, కశ్మీరీలపై ద్వేషం లేదని, శాంతి మరియు న్యాయమే తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు. “మత ఘర్షణలకు తెరపడాలి. ఇది వినయ్ ఆకాంక్ష కూడా,” అని ఆమె ఉద్వేగంతో అన్నారు. ఈ రక్తదాన శిబిరాన్ని నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరమ్ ఆఫ్…

 
         
         
         
         
        