లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలుఫై అమిత్ షా ప్రకటన

కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రభుత్వ సేవలను ఇంటి వద్దే పొందే అవకాశం లభిస్తుందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు.  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు లడఖ్ సర్వతోముఖాభివృద్దికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు. అయితే, లడఖ్ వాసులు తమకు రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేస్తుండగా… కేంద్రం…

Read More

ఢిల్లీలో జర్నలిస్టుల నిరసనఫై కేటీఆర్ రీట్వీట్

తెలంగాణలో జర్నలిస్టుల మీద దాడులను నిరసిస్తూ ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం ఎదుట తెలంగాణ స్వతంత్ర జర్నలిస్టులు నిరసనకు దిగారు. ఈ నిరసనకు సంబంధించిన వివరాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నివాసం ఎదుట ఆందోళన చేపట్టిన వారిలో జర్నలిస్ట్ శంకర్, వీణవంక ప్రభాకర్, సుంకరి ప్రవీణ్, లింగస్వామి ఉన్నారు. రాష్ట్రంలో వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న స్వతంత్ర జర్నలిస్టులపై దాడులు…

Read More

కేరళలో 70 ఏళ్ల వృద్ధురాలిపై దారుణం, నిందితుడి అరెస్ట్

దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక హింస, నేరాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ మరో దారుణం వెలుగుచూసింది. కేరళలోని అలప్పుజా జిల్లాలో ఓ 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో దొంగతనానికి వచ్చిన 29 ఏళ్ల ధనేష్ అనే నిందితుడు ఈ నేరానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇంట్లోని నగలు దోచుకున్న అనంతరం వృద్ధురాలి కళ్లలో కారం చల్లి నిందితుడు పారిపోయాడని పోలీసులు వివరించారు. వృద్ధురాలు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా…

Read More

ఉపాధ్యాయుడు మత్తులో నిద్ర: కామాఖ్యనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు

తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే మన సంస్కృతి ప్రాధాన్యం ఇచ్చింది. విద్యార్థుల్లో స్ఫూర్తినింపి వారి భవిష్యత్తును బంగారుమయం చేసే బాధ్యతను సమాజం వారిపైనే పెట్టింది. అయితే, అలాంటి గురువుల్లో కొందరు నీచంగా ప్రవర్తిస్తూ మొత్తం ఉపాధ్యాయ వ్యవస్థకే కళంకం తెస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. పూటుగా తాగి బడికి వచ్చిన ఉపాధ్యాయుడికి ఆ తర్వాత మత్తు మరింత ఎక్కువైంది. కుర్చీలో కూలబడి అలాగే నిద్రపోయాడు. విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు అతడిని లేపేందుకు ప్రయత్నించినా…

Read More

టీం బిల్డింగ్ ఈవెంట్‌లో వేధింపులు, మహిళా ఉద్యోగి రాజీనామా

పని ప్రదేశంలో మహిళలకు ఎదురవుతున్న వేధింపులకు ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. కంపెనీ టీం బిల్డింగ్ ఈవెంట్‌లో తనను ముద్దాడతానని తండ్రి వయసున్న ఉద్యోగి ఒకరు బెదిరించడంతో ఇంటర్న్‌షిప్ చేస్తున్న మహిళా ఉద్యోగి రాజీనామా చేశారు. వియత్నాంలో జరిగిన ఈ ఘటన మహిళ భద్రతపై మరోమారు ప్రశ్నలు లేవనెత్తింది.  ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ కథనం ప్రకారం.. బాధిత మహిళ హుయన్హ్ మై గత ఏడాది కంపెనీ నిర్వహించిన ఈవెంట్‌లో తప్పనిసరిగా పాల్గొనాల్సి వచ్చింది. ఈ టీం బిల్డింగ్…

Read More

ఆర్‌బీఐ 90 క్విజ్: లక్షల బహుమతుల కోసం విద్యార్థులకు అవకాశం

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) స్థాపించి 90 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాలేజీ విద్యార్థుల కోసం ‘ఆర్‌బీఐ 90 క్విజ్’ను ప్రకటించింది. ఈ పోటీలో విజయం సాధించిన విద్యార్థులు రూ. 10 లక్షల బహుమతి గెలుచుకోవచ్చు. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ పోటీ కోసం ఆన్‌లైన్‌లో ఆడిషన్స్ నిర్వహిస్తారు. అనంతరం వివిధ దశల్లో రాష్ట్ర చాంపియన్‌ను ఎంపిక చేస్తారు. వారు ఆ తర్వాత జాతీయ స్థాయిలో పోటీపడాల్సి ఉంటుంది. అక్కడ గెలిచిన వారికి రూ. 10…

Read More

సీన్ రిక్రియేషన్ క్రమంలో పరార్.చెరువులో శవమై తేలిన నిందితుడు

అస్సాంలో బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనా స్థలంలో ‘సీన్ రిక్రియేషన్’ కోసం నిందితుడిని తీసుకెళ్లిన పోలీసులకు మస్కా కొట్టి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో దగ్గర్లో ఉన్న ఓ చెరువులో దూకాడు. ఉదయానికి అదే చెరువులో శవమై తేలాడు. నాగౌన్ జిల్లా ధింగ్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధింగ్ గ్రామంలో గురువారం ట్యూషన్ నుంచి తిరిగి వస్తున్న పద్నాలుగేళ్ల…

Read More