ఎన్టీఆర్ వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం
భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముంపు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో కొందరు ప్రముఖులు వరద బాధితులకు తమవంతు సాయం చేందుకు ముందుకు వస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ విరాళాలు ప్రకటించారు. తాజాగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు. ఈ మేరకు ‘ఎక్స్’…
