ఏపీ భవన్‌కి బాంబు బెదిరింపు కలకలం
ఢిల్లీ కేంద్రంలో ఉన్న ఏపీ భవన్‌కు శుక్రవారం రాత్రి ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈమెయిల్‌లో భవన్‌ను పేల్చేస్తామని పేర్కొనడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో వచ్చిన ఈ బెదిరింపు అధికారులను ఆందోళనకు గురిచేసింది. ఆ సమయంలో భవన్‌లో పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు. వారు ‘‘పూలే’’ సినిమా ప్రత్యేక ప్రదర్శన కోసం అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో మెయిల్ రావడంతో భద్రతా సిబ్బంది వెంటనే…
