బెంగళూరులో ఓ యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని దుస్తులు విప్పించి చితకబాదారు. 3 మంది అరెస్ట్.

మహిళపై అసభ్యకర ప్రవర్తన చేసిన వ్యక్తికి గుంపు దాడి

ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, ఆమె శరీర భాగాలు తాకిన 33 ఏళ్ల వ్యక్తిని కొందరు పట్టుకుని దుస్తులు విప్పించి చితకబాదారు. బెంగళూరు శివారులోని కాల్‌కరే గ్రామంలో జరిగిందీ ఘటన. ధర్వాడ్‌కు చెందిన బాధితుడు రవికుమార్ రెండేళ్లుగా కాల్‌కరే సమీపంలోని ఓ హోటల్‌లో కుక్‌గా పనిచేస్తున్నాడు. రాత్రి పది గంటల సమయంలో ఓ యువతి (20) పాలు కొనేందుకు రోడ్డుపైకి వచ్చింది. ఆమెను చూసిన రవికుమార్ అసభ్యంగా ప్రవర్తిస్తూ శరీరాన్ని అనుచితంగా తాకాడు. దీంతో ఆమె…

Read More
కాళింది ఎక్స్‌ప్రెస్‌ ట్రాక్‌పై సిలిండర్ ఉంచిన వ్యక్తుల వల్ల ప్రమాదం తప్పింది. లోకోపైలట్‌ సమయస్పూర్తితో ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలు నిలిపాడు.

ప్రయాగ్‌రాజ్-భివానీ రైలుకు పెను ప్రమాదం తప్పింది

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-భివానీ కాళింది ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కాన్పూర్‌లోని ముదేరి గ్రామంలో నిన్న ఉదయం రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ సిలిండర్ పెట్టారు. గమనించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో రైలు సరిగ్గా అక్కడికొచ్చి దానిని ఢీకొట్టి ఆగింది. లేదంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని రైల్వే అధికారులు తెలిపారు.  నిన్న ఉదయం 8.20 గంటల సమయంలో జరిగిందీ ఘటన. రైలు హర్యానాలోని భివానీ వెళ్తుండగా శివరాజ్‌పూర్ దాటిన తర్వాత పట్టాలపై…

Read More
సెన్సెక్స్ 1017 పాయింట్లు, నిఫ్టీ 292 పాయింట్లు నష్టపోగా, బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.5.3 లక్షల కోట్లు తగ్గింది.

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం, రూ.5.3 లక్షల కోట్లు నష్టం

భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఈ ఒక్కరోజే రూ.5.3 లక్షల కోట్లు తగ్గింది. సెన్సెక్స్ ఏకంగా 1017 పాయింట్లు క్షీణించి 81,183 వద్ద, నిఫ్టీ 292 పాయింట్లు నష్టపోయి 24,852 వద్ద స్థిరపడింది. అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు అంచనాలు, యూఎస్ ఉద్యోగ నివేదికకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. మార్కెట్ భారీ పతనం కారణంగా బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.5.3…

Read More
ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లో వరద నష్ట అంచనా, సహాయక చర్యలకు కేంద్రం నిపుణుల బృందాలు పంపి, 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్లు సిద్ధం.

తెలుగు రాష్ట్రాల కోసం కేంద్రం నుండి పూర్తి సహకారం

ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సహాయక చర్యలపై ఎక్స్ వేదికగా కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వరద ప్రాంతాలకు ఇప్పటికే నిపుణుల బృందాన్ని పంపించినట్లు తెలిపింది. వరదలు, డ్యాంలు, వాటి భద్రతను కేంద్ర బృందం పరిశీలిస్తుందని వెల్లడించింది. వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది….

Read More
తప్పుడు కేసు వేధింపులపై ఏపీ పోలీసులకు నటి కాదంబరి ఫిర్యాదు. విద్యాసాగర్ కుట్రలో భాగమని, కుటుంబానికి రక్షణ కోరుతూ మీడియా వాఖ్యలు.

ఏపీ పోలీసులపై నటి కాదంబరి ఫిర్యాదు… తప్పుడు కేసుల ఆరోపణ..

ఏపీ పోలీస్ ఉన్నతాధికారులపై బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టి, అరెస్టు చేసి వేధింపులకు గురి చేసిన వ్యవహారంలో నాటి విజయవాడ సీపీ కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు కీలకంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నది. గురువారం రాత్రి విజయవాడ సీపీ కార్యాలయానికి చేరుకున్న నటి కాదంబరి .. దర్యాప్తు అధికారి ఏసీపీ స్రవంతి రాయ్ ను కలిసి ఫిర్యాదు అందజేసింది. వైసీపీ నేత కుక్కల…

Read More
హ‌ర్వింద‌ర్ సింగ్ పారాలింపిక్స్‌లో తొలి స్వర్ణం సాధించిన భారతీయ ఆర్చర్‌గా చరిత్ర సృష్టించాడు, భారత్‌ 24 పతకాలతో దూసుకెళ్తోంది. 4o

పారాలింపిక్స్‌లో హ‌ర్వింద‌ర్ సింగ్ స్వ‌ర్ణం

పారిస్‌లో జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త అథ్లెట్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో దూసుకెళ్తున్నారు. ప‌త‌కాల పంట పండిస్తున్నారు. తాజాగా పురుషుల వ్య‌క్తిగ‌త రిక‌ర్వ్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్‌లో ఆర్చ‌ర్ హ‌ర్వింద‌ర్ సింగ్ ఏకంగా స్వ‌ర్ణం కొల్ల‌గొట్టాడు. ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్‌లో పోలాండ్‌కు చెందిన లుకాస్జ్ సిజెక్‌ను 6-0తో ఓడించాడు. దీంతో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ ఆర్చర్‌గా హర్విందర్ సింగ్ చరిత్ర సృష్టించాడు.  అటు ఒలింపిక్స్‌లోనూ ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త్‌కు ఆర్చ‌రీలో గోల్డ్ మెడ‌ల్ రాలేదు. కాగా, 33…

Read More

భారీ వరదల నేపథ్యంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటన

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ సూచనల మేరకు ఆయన నేటి నుంచి రెండు రోజుల పాటు ఏపీ, తెలంగాణలలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈరోజు విజయవాడ, ఏపీలోని ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. బాధిత కుటుంబాలు, రైతులను పరామర్శిస్తారు. ఆ తర్వాత విజయవాడలో అధికారులతో సమావేశమవుతారు. నష్టం అంచనాపై అధికారులతో చర్చిస్తారు. రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. వరదలతో అతలాకుతలమవుతున్న ఖమ్మం…

Read More