ఢిల్లీలో కాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగింది
దేశ రాజధాని ఢిల్లీ శుక్రవారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ముద్ర వేసుకుంది. దీపావళి సందర్భంగా, గత రాత్రి ఢిల్లీ వ్యాప్తంగా పేలిన బాణసంచా వల్ల కాలుష్యం భయంకరంగా పెరిగిపోయింది. బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ, ప్రజలు ఈ ఆదేశాలను పక్కన పెడుతూ, నిషేధాన్ని ఉల్లంఘించారు. ఫలితంగా, ఢిల్లీపై కాలుష్యం దుప్పటిలా పరుచుకుంది, ఈ ఉదయం ఆరు గంటల సమయానికి గాలి నాణ్యత ఇండెక్స్ (ఏక్యూఐ) రికార్డు స్థాయిలో 359 దాటిపోయింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు…
