ఒడిశా అడవుల్లో అరుదైన నల్ల చిరుత సందర్శన
ఒడిశా అడవుల్లో అరుదైన నల్ల చిరుత సంచరిస్తోందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. నల్ల చిరుతలు కేవలం మూడు ప్రాంతాల్లో మాత్రమే ఉండటంతో, వాటి సందర్శన విశేషమైంది. నాయాగఢ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఇటీవల ఈ చిరుత కెమెరాకు చిక్కింది. దీనిని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రేమ్ కుమార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. సెంట్రల్ ఒడిశాలో నల్ల చిరుతలు చాలా అరుదుగా కనిపిస్తాయని ప్రేమ్ కుమార్ వివరించారు. ఈ జంతువుల కదలికలను గుర్తించేందుకు అటవీ ప్రాంతాల్లో అమర్చిన…
