మహారాష్ట్ర రైలు ప్రమాదంపై మోదీ సానుభూతి
మహారాష్ట్రలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధితులకు అన్ని రకాల సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయనే వదంతులు ప్రయాణికుల్లో ఆందోళన రేపాయి. భయంతో చైన్ లాగి రైలు ఆపిన ప్రయాణికులు హుటాహుటిన కిందకు దిగి పరుగులు తీశారు….
