ఖోఖో ఛాంపియన్లకు అన్యాయం? కర్ణాటక ఆటగాళ్ల అసంతృప్తి
ఖోఖో ప్రపంచకప్ గెలిచి దేశ కీర్తిని పెంచిన కర్ణాటక ఆటగాళ్లు తమకు తగిన గౌరవం దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం తమ ఆటగాళ్లకు రూ. 2.25 కోట్లు, ఉద్యోగం ప్రకటించగా, కర్ణాటకలో మాత్రం రూ. 5 లక్షలతో సరిపెట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన బహుమతిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన ఎం కె గౌతమ్, చైత్ర బి, ఇది ప్రభుత్వాన్ని అవమానించడమేమీ కాదని, తమ గౌరవాన్ని కాపాడుకునే చర్య అని స్పష్టం చేశారు. గౌతమ్ మాట్లాడుతూ,…
