వసంత పంచమి సందర్భంగా మహాకుంభమేళాకు భారీగా భక్తులు!
వసంత పంచమి పర్వదినం సందర్భంగా మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు గంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా అమృతస్నానాలు చేస్తూ భక్తి సంద్రంగా మారింది. త్రివేణీసంగమంలో పవిత్ర స్నానం ఆచరించి పాప విమోచనం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ రోజు ఒక్కరోజే 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. కుంభమేళా ప్రధాన ఘట్టాల్లో వసంత పంచమి ప్రత్యేకమైనదిగా భావిస్తారు. భక్తులతో పాటు సాధువులు, మునులు, అఖాడాల గురువులు…
