అమెరికా బహిష్కరణలో భాగంగా భారతీయులు వెనక్కి
అమెరికాలో బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. ట్రంప్ అధ్యక్షతలో అమలు అవుతున్న ఈ ఆపరేషన్‌లో అక్రమ వలసదారుల్ని గుర్తించి, ఆయా దేశాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా భారత్‌కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన ఓ విమానం అమెరికాను విడిచింది. ఈ విమానం మరికొన్ని గంటల్లో భారత్ చేరుకునే అవకాశం ఉంది. అయితే, ఈ విమానంలో ఎంతమంది ఉన్నారు అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అమెరికాలో అక్రమంగా ఉన్న భారతీయుల సంఖ్య దాదాపు 7.25 లక్షలుగా అంచనా…
