Maharashtra CM Fadnavis received a threat message from a Pakistan number, prompting tightened security.

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పాకిస్థాన్ నంబర్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. శుక్రవారం ఉదయం ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ ద్వారా సందేశం రాగా, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ అందులో హెచ్చరించారు. ఈ మెసేజ్‌ను మాలిక్ షాబాజ్ హుమాయున్ అనే వ్యక్తి పంపినట్టు గుర్తించారు. బెదిరింపు సందేశం నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి నివాసం, సీఎం క్యాంపు కార్యాలయం, ఇతర కీలక ప్రభుత్వ భవనాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పోలీసులు ఈ…

Read More
Customs officials seized 172 grams of gold hidden in dates from a passenger arriving from Jeddah at Delhi Airport.

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఖర్జూరాల్లో దాచిన బంగారం పట్టివేత

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బంగారం అక్రమ రవాణా ఘటనను గుర్తించారు. జెడ్డా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని అనుమానంతో తనిఖీ చేయగా, అతని బ్యాగులో ఖర్జూరాలు ఉండటం కనిపించింది. బ్యాగేజీ చెకింగ్ సమయంలో మరింత పరిశీలన చేయగా, ఖర్జూరాల్లో బంగారు ముక్కలు దాచినట్లు అధికారులు గుర్తించారు. 56 ఏళ్ల ప్రయాణికుడు ఎస్వీ-756 విమానంలో జెడ్డా నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. లగేజీ చెకింగ్ సమయంలో అతని బ్యాగ్‌పై అనుమానం కలిగిన…

Read More
India reaches Champions Trophy semis; Rohit Sharma may rest for the New Zealand match.

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌కు టీమిండియా, రోహిత్ విశ్రాంతి?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు వరుస విజయాలతో సెమీఫైనల్‌కు చేరుకుంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లపై గెలిచిన టీమిండియా, లీగ్ దశలో చివరి మ్యాచ్‌ను మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడనుంది. అయితే, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ విశ్రాంతి తీసుకునే అవకాశముందని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొంది. భారత జట్టు బుధవారం నుంచి ప్రాక్టీస్ ప్రారంభించినా, రోహిత్…

Read More
PM Modi thanked devotees and praised the Uttar Pradesh government for the successful completion of Maha Kumbh Mela.

మహా కుంభమేళా విజయవంతంపై ప్రధాని మోదీ ప్రశంసలు

మహా కుంభమేళా సందర్భంగా పూజా కార్యక్రమాల్లో ఏదైనా లోపం ఉంటే గంగా, యమునా, సరస్వతి మాతలు క్షమించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రార్థించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా, ఏర్పాట్లలో లోపం ఉన్నా క్షమించమని కోరారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచిన కుంభమేళా మహాశివరాత్రి రోజున ముగిసింది. సుమారు 45 రోజుల పాటు జరిగిన ఈ కుంభమేళాలో 66 కోట్ల మంది భక్తులు పాల్గొని గంగాస్నానం ఆచరించారు. వివిధ ప్రాంతాల నుండి, విదేశాల నుండి వచ్చిన…

Read More
A human trafficking gang smuggling newborns from Ahmedabad was busted by SOT Malkajgiri and Chaitanyapuri police, rescuing four infants.

హైదరాబాద్‌లో శిశువుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్

అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు చిన్నారులను అక్రమ రవాణా చేస్తూ అమ్ముతున్న ముఠాను ఎస్ఓటీ మల్కాజిగిరి, చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో 11 మంది సభ్యులను పట్టుకుని, వారి వద్ద నుంచి నాలుగు చిన్నారులను రక్షించారు. రాచకొండ సీపీ జి.సుధీర్‌బాబు ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 5 వేల రూపాయల నగదు, 11 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. పిల్లలను అమ్మే ముఠా మగబిడ్డలను నాలుగు నుంచి…

Read More
In UP, a groom, in a drunken state, mistakenly garlanded the bride’s friend. Enraged, the bride slapped him and called off the wedding.

మద్యం మత్తులో వరుడి నిర్వాకం, పెళ్లిని రద్దు చేసిన వధువు

ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో పెళ్లి వేడుకలో వింత ఘటన చోటుచేసుకుంది. వరుడు మద్యం మత్తులో వధువు మెడలో కాకుండా, పక్కనే ఉన్న ఆమె స్నేహితురాలికి మాల వేసాడు. ఈ సంఘటనతో ఆగ్రహించిన వధువు వరుడిని చెంపచెళ్లుమనిపించి పెళ్లిని రద్దు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, 21 ఏళ్ల రాధాదేవి, 26 ఏళ్ల రవీంద్ర కుమార్‌ల వివాహం నిర్దేశిత రోజు జరగాల్సి ఉంది. అయితే, వరుడు ఆలస్యంగా, మద్యం మత్తులో పెళ్లి మండపానికి చేరుకున్నాడు. ఆ సమయంలో వధువు కుటుంబానికి…

Read More
A SouthWest Airlines pilot averted disaster at Chicago airport by aborting landing as a private jet unexpectedly crossed the runway.

షికాగో విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది

అమెరికాలోని షికాగో మిడ్ వే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఓ విమానం ల్యాండవుతున్న సమయంలో రన్‌వేపైకి మరో ప్రైవేట్ జెట్ అడ్డంగా రావడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని మళ్లీ టేకాఫ్ చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒమాహా నుంచి బయలుదేరిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం ఉదయం 8:47 గంటలకు షికాగో విమానాశ్రయంలో ల్యాండవుతోంది. రన్‌వే 31సీపై దిగుతుండగా, ఛాలెంజర్ 350 ప్రైవేట్ జెట్ అనుమతి లేకుండా రన్‌వేపైకి…

Read More