లగచర్ల, హకీంపేట భూసేకరణపై హైకోర్టు స్టే
లగచర్ల, హకీంపేటలో భూసేకరణపై హైకోర్టు ప్రభుత్వానికి కఠినమైన స్టే విధించింది. భూసేకరణ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలో ఫార్మా కంపెనీ కోసం, హకీంపేటలో ఇండస్ట్రియల్ పార్కు కోసం ప్రభుత్వం భూములను సేకరించాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, స్థానిక రైతుల నిరసనలతో ఈ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. లగచర్లలో భూసేకరణ ప్రక్రియను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. కలెక్టర్ రైతుల అభిప్రాయం తెలుసుకోవడానికి లగచర్లను సందర్శించినప్పుడు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్‌పై…
