CM Chandrababu to attend a minister’s event in Delhi, set to meet Bill Gates tomorrow for discussions on AP development.

ఢిల్లీకి సీఎం చంద్రబాబు – రేపు బిల్‌గేట్స్‌తో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. కేంద్రమంత్రి భూపేంద్ర సింగ్ చౌహాన్ నివాసంలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగానికి అవసరమైన సహాయ సహకారాల గురించి ఆయన ఢిల్లీ పర్యటనలో చర్చించనున్నారు. రేపు చంద్రబాబు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో సమావేశం కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించనుందని సమాచారం. ఈ భేటీలో నూతన పరిజ్ఞానం, ఆరోగ్య…

Read More
Ayodhya Ram Temple Trust paid ₹400 crore in taxes over five years, with 1.26 crore devotees visiting during Maha Kumbh Mela.

అయోధ్య రామమందిరం ట్రస్ట్ రూ.400 కోట్లు పన్నులు చెల్లింపు

అయోధ్య శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గత ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో దాదాపు రూ.400 కోట్లు చెల్లించినట్లు ప్రకటించింది. ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ, ఇందులో రూ.270 కోట్లు జీఎస్టీగా, మిగతా రూ.130 కోట్లు ఇతర పన్నులుగా చెల్లించినట్లు వెల్లడించారు. ఇటీవల జరిగిన మహా కుంభమేళా సమయంలో 1.26 కోట్ల మంది భక్తులు అయోధ్యను సందర్శించారని ట్రస్ట్ వెల్లడించింది. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం…

Read More
Sulagitti Narasamma assisted in over 15,000 births, dedicating her life to pregnant women’s care. She was honored with a doctorate for her service.

ప్రసవ సేవల్లో మహానుభావురాలు సూలగుత్తి నరసమ్మ

సూలగుత్తి నరసమ్మ, కర్ణాటకలోని వెనుకబడిన కొండ ప్రాంతంలో వైద్య సదుపాయాలు లేని గ్రామాల్లో ప్రకృతి వైద్యంతో ప్రసవాలను నిర్వహించిన అసాధారణ మహిళ. ఆమె విద్య లేనప్పటికీ, గర్భిణీలను పరీక్షించి ప్రసవ సమయం, శిశువు ఆరోగ్య పరిస్థితులను ఖచ్చితంగా చెప్పగలదు. ఆధునిక వైద్యం కూడా గమనించలేని అంశాలను ఆమె సులభంగా గుర్తించగలదు. తన జీవితంలో 15,000కు పైగా ప్రసవాలు చేసిన నరసమ్మ, ఎటువంటి డబ్బులు తీసుకోకుండా సేవలందించేది. ఆమెను ప్రసవ విధానంలో దిట్టగా భావించి, అనేక గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు…

Read More
TN CM Stalin invited Revanth Reddy to discuss the impact of constituency delimitation on southern states.

నియోజకవర్గ పునర్విభజనపై చర్చకు రేవంత్ రెడ్డికి ఆహ్వానం

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నియోజకవర్గాల పునర్విభజనపై ప్రత్యేక సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో తమిళనాడు మంత్రి టి.కె. నెహ్రూ నేతృత్వంలోని డీఎంకే ప్రతినిధి బృందం ఢిల్లీలో రేవంత్ రెడ్డిని కలసి ఈ ఆహ్వానం అందజేసింది. ఈ నెల 22న చెన్నైలో జరగనున్న ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన ద్వారా కలిగే ప్రభావంపై ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు సమాలోచనలు జరపనున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత…

Read More
Madras High Court ruled that Tamil is mandatory for government jobs in Tamil Nadu, stating that officials must know the language to perform duties.

తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగాలకు తమిళం తప్పనిసరి

తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులకు తమిళ భాష రాయడం, చదవడం తప్పనిసరిగా నేర్చుకోవాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ స్పష్టం చేసింది. ప్రజల మధ్య పనిచేయాల్సిన ఉద్యోగులకు స్థానిక భాష తెలియకపోతే, విధులను సమర్థవంతంగా నిర్వహించలేరని కోర్టు వ్యాఖ్యానించింది. తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఉద్యోగం కోసం పరీక్ష రాసిన జయకుమార్ అనే అభ్యర్థి, తమిళ పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో ఉద్యోగం నుంచి తొలగించడంపై అతను హైకోర్టును ఆశ్రయించాడు. తండ్రి నావికాదళంలో పనిచేయడం వల్ల తాను…

Read More
Justice Joymalya Bagchi assumed charge as a Supreme Court judge on Monday after his recent appointment by the Center.

సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చీ బాధ్యతల స్వీకారం

సుప్రీంకోర్టు నూతన జడ్జిగా జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చీ సోమవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల సుప్రీంకోర్టు కొలిజియం ఆయనను అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా నియమించేందుకు సిఫారసు చేయగా, కేంద్రం ఆమోదం తెలిపి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన తాజాగా పదవిని స్వీకరించారు. జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చీ గతంలో కలకత్తా హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహించారు. న్యాయరంగంలో అనేక కీలక కేసులను విచారించిన అనుభవం కలిగిన ఆయనకు పదోన్నతి లభించింది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా సేవలందించనుండటం…

Read More
Mani Shankar Aiyar’s remarks on Rajiv Gandhi spark controversy, with BJP using them to attack Congress.

రాజీవ్‌పై మణిశంకర్ వ్యాఖ్యలు – బీజేపీ విమర్శలు

కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఈసారి ఆయన వ్యంగ్యాస్త్రాలు విపక్షాలపై కాదు… దివంగత ప్రధాని రాజీవ్ గాంధీపై పేల్చారు. ఆయన విద్యా నేపథ్యం, కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ కాలేజీల్లో విఫలమైన విషయాలను ప్రస్తావిస్తూ, అలాంటి వ్యక్తి దేశ ప్రధాని ఎలా అయ్యారని ప్రశ్నించారు. “రాజీవ్ గాంధీ విద్యార్థి దశలో రెండు సార్లు పరీక్షలు తప్పారు. కేంబ్రిడ్జ్ వర్సిటీలో ఫెయిల్ అయ్యారు, అక్కడ ఫెయిలవడం చాలా అరుదు. ఎందుకంటే, అధిక…

Read More