మెరీకోమ్ వైవాహిక బంధానికి ముగింపు సంకేతాలు
భారతదేశానికి గర్వకారణమైన మహిళా బాక్సింగ్ లెజెండ్ మేరీకోమ్ వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆమె తన భర్త ఓన్లర్ కరుంగ్‌తో 20 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకబోతున్నారని సమాచారం. వీరి మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో విడాకుల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుందట. 2022లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓన్లర్ రాజకీయాల్లో ప్రవేశించి ఓడిపోవడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని చెబుతున్నారు. ఆర్థిక నష్టాలు, అభిప్రాయ భేదాలు వీరి మధ్య దూరాన్ని…
