 
        
            బెంగళూరులో మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య
కర్ణాటక మాజీ డీజీపీ, సీనియర్ ఐపీఎస్ అధికారి ఓం ప్రకాశ్ (72) ఆదివారం బెంగళూరులోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని ఇంట్లో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఛాతీ, పొట్టపై తీవ్ర కత్తిపోట్లు ఉండటంతో ఇది ఉద్దేశపూర్వక దాడిగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యలో ప్రధాన నిందితురాలిగా ఆయన భార్య పల్లవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఉన్న కుమార్తె కృతిని కూడా…

 
         
         
         
         
        