 
        
            భారత్ పర్యటనలో జేడీ వాన్స్ కుటుంబానికి రాజస్వాగతం
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబసమేతంగా సోమవారం భారత్‌కి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీతో భేటీ అనంతరం విందులో పాల్గొన్న వాన్స్ కుటుంబం, ఢిల్లీ నుంచి జైపూర్ చేరుకుని రాజస్థానీ సంస్కృతిని ఆస్వాదిస్తున్నారు. మంగళవారం ఉదయం వారు అంబర్ కోటను సందర్శించారు. అక్కడ వాన్స్ కుటుంబానికి సాంప్రదాయ రాజస్థానీ నృత్యాలతో, శోభాయమానమైన ఏనుగులతో ఘనంగా స్వాగతం పలికారు. ఇది చూసిన పర్యాటకులు మరియు స్థానికులు ఆశ్చర్యపోయారు. వాన్స్ కుటుంబం ఆనందంగా రాజస్థానీ సంస్కృతిని ఆస్వాదిస్తూ అక్కడి…

 
         
         
         
         
        