
మాలీవుడ్ లైంగిక వేధింపులపై హేమ కమిటీ రిపోర్ట్ కలకలం
మాలీవుడ్‌లో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు తీవ్ర కలకలాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ నివేదిక మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై షాకింగ్ విషయాలు వెల్లడించింది. దాంతో ఈ రిపోర్ట్‌పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో దక్షిణాది సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు రాధికా శరత్‌కుమార్ తాజాగా లైంగిక వేధింపులు కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు అన్ని ఇండస్ట్రీల్లో ఉన్నాయన్నారు. హీరోయిన్లు, నటీమణులు దుస్తులు మార్చుకునే సినిమా సెట్‌ల సమీపంలోని కారవాన్లలో…