పహల్గామ్ ప్రభావంతో బాలీవుడ్ ఈవెంట్ వాయిదా
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం దేశవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం బాలీవుడ్ పరిశ్రమపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మే 4, 5 తేదీలలో లండన్‌లో జరగాల్సిన ‘బాలీవుడ్ బిగ్ వన్’ కార్యక్రమాన్ని నిర్వాహకులు తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈవెంట్ వాయిదా వెనుక కారణాలను వివరించిన సల్మాన్ ఖాన్, పహల్గామ్ ఘటన వల్ల ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల్లో అభిమానుల భద్రతను దృష్టిలో…
