
‘దేవర’ మూవీ హిట్‌తో జాన్వీ కపూర్ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు
‘దేవర’ మూవీ హిట్‌తో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం జోరుమీద ఉన్నారు. ఆమె ఇటీవల హైదరాబాద్ మధురానగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. భక్తిభావం కలిగిన జాన్వీ తరచూ షూటింగ్ విరామంలో ఆలయాలను సందర్శిస్తుంటారు. ఆంజనేయస్వామి ఆలయంలో జాన్వీకి అర్చకులు స్వాగతం పలికారు. అరగంటపాటు పూజలు నిర్వహించిన జాన్వీ కపూర్, అనంతరం అర్చకుల వద్ద నుండి తీర్థ ప్రసాదాలు అందుకొని ఆశీర్వదించబడ్డారు. ఈ సందర్భంలో ఆమె ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించబోయిన విషయం తెలుసుకున్న అభిమానులు, స్థానికులు…