
నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్
సినీ నటుడు అల్లు అర్జున్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఇటీవల సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కోర్టు ఆదేశాల ప్రకారం ఆయన కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంలో ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కోర్టుకు చేరుకుని బెయిల్ పత్రాలను సమర్పించారు. పత్రాలు సమర్పించిన అనంతరం అల్లు అర్జున్ తన ఇంటికి తిరిగి వెళ్లారు. గత నెలలో పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ…