‘తండేల్’ ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా.. రేపటికి షిఫ్ట్!
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తండేల్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని మేకర్స్ తెలిపారు. ఈ వేడుకను రేపటికి (ఆదివారం) మార్చినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. “ది ఐకానిక్ తండేల్ జాతరను రేపటికి వాయిదా వేస్తున్నాం. ఈవెంట్ భారీ స్థాయిలో…
