Aishwarya Rajesh’s crime thriller ‘Suzhal 2’ is set to stream in five languages from the 28th. The first season received immense appreciation.

ఐశ్వర్య రాజేశ్ ‘సుడల్ 2’తో మిస్టరీ థ్రిల్లర్ రీటర్న్!

తెలుగు, తమిళ భాషల్లో ఐశ్వర్య రాజేశ్‌కు మంచి క్రేజ్ ఉంది. ఆమె నాయికా ప్రధానమైన సినిమాలతోనే కాకుండా వెబ్ సిరీస్‌లతో కూడా బిజీగా ఉంది. తాజాగా ఆమె నుంచి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ‘సుడల్ 2’ పేరుతో రూపొందిన ఈ సిరీస్, ఫస్ట్ సీజన్‌కు వచ్చిన స్పందన తర్వాత మరింత ఆసక్తిగా మారింది. ‘సుడల్’ తొలి సీజన్ 2022 జూన్ 17న స్ట్రీమింగ్ అయింది. ఆ థ్రిల్లర్ కథకు ప్రేక్షకుల…

Read More
Due to a shortage of players, South Africa's fielding coach Wandile Gwavu took the field as a substitute in a rare cricketing incident.

ఆటగాళ్లు లేరు.. ఫీల్డింగ్ కోచ్ బరిలోకి దిగిన ఘటన!

త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్న దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు ట్రై సిరీస్‌లో పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా లాహోర్ గడాఫీ స్టేడియంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సఫారీ జట్టుకు సరిపడా ఆటగాళ్లు లేకపోవడంతో వారి ఫీల్డింగ్ కోచ్ వాండిలే గ్వావు ప్రత్యామ్నాయంగా బరిలోకి దిగాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ టోర్నీ కోసం కేవలం 12 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక…

Read More
A devoted fan of Bollywood actor Sanjay Dutt willed ₹72 crore to him, but he declined and ensured it went back to her family.

అభిమాని రూ.72 కోట్లు రాసివ్వగా తిరస్కరించిన సంజయ్ దత్

సినీ హీరోలకు విపరీతమైన అభిమానులు ఉంటారు. కొందరు అభిమానులు తమ అభిమాన హీరో కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. పోస్టర్లు కట్టడం, పాలాభిషేకాలు చేయడం సహజమే. అయితే ముంబైకి చెందిన నిషా పాటిల్ అనే మహిళ తన ఆస్థి మొత్తం బాలీవుడ్ హీరో సంజయ్ దత్ పేరిట రాసిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిషా పాటిల్ వయసు 62 సంవత్సరాలు. బాల్యం నుంచే సంజయ్ దత్‌కు వీరాభిమానిగా ఉండేది. ఆయన నటించిన ప్రతి సినిమాను అనేకసార్లు చూసేది….

Read More
CID issues notices to Varma over 'Kamma Rajyamlo Kadapa Reddlu'. He has been asked to appear for inquiry in Guntur on February 10.

వర్మకు మరో కేసు, సీఐడీ విచారణకు హాజరుకావాలి

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. 2019లో విడుదలైన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గతంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు గుంటూరు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణను చేపట్టారు. ఈ నేపథ్యంలో వర్మను ఫిబ్రవరి 10న గుంటూరు సీఐడీ కార్యాలయంలో…

Read More
Monalisa Bhosale, who became an internet sensation at Kumbh Mela, lands a Bollywood role in ‘The Diary of Manipur’.

కుంభమేళాలో మెరిసిన మోనాలిసా.. బాలీవుడ్‌లో అరంగేట్రం

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మోనాలిసా భోస్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 16 ఏళ్ల ఈ తేనె కళ్ల సుందరి ఒక్కసారిగా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిపోయింది. ఆమె అందాన్ని చూసి ఫొటోలు, వీడియోలు తీశారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగిపోతోంది. ఆమె క్రేజ్‌ చూస్తే బాలీవుడ్‌ నుంచి ఆఫర్ రావడం ఖాయం అనిపించింది. అలా దర్శకుడు సనోజ్ మిశ్రా తన సినిమాకి మోనాలిసాను ఎంపిక చేశారు. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ అనే చిత్రంలో…

Read More
The Akkineni family met PM Modi and discussed their family biography. Their Parliament visit photos have gone viral.

అక్కినేని కుటుంబం ప్రధాని మోదీని కలిసిన విశేషాలు

అక్కినేని కుటుంబం ఈరోజు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని క‌లిసి ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఈ సమావేశానికి నాగార్జున, అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల హాజరయ్యారు. ప్రధానితో సమావేశంలో అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్రపై రూపొందిస్తున్న పుస్తకం గురించి చర్చ జరిగినట్లు సమాచారం. పుస్తకాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. భేటీ అనంతరం అక్కినేని కుటుంబ సభ్యులు పార్లమెంట్ సందర్శించారు. పార్లమెంటులో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు ఆసక్తిగా స్పందిస్తున్నారు. కాగా, నాగార్జున,…

Read More
‘Tandel’ blends love, patriotism, and survival in a gripping oceanic tale. Naga Chaitanya & Sai Pallavi shine, with music adding emotional depth.

సముద్రపు ప్రేమకథలో దేశభక్తి తాలూకు ‘తండేల్

‘తండేల్’ యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా. శ్రీకాకుళం జిల్లా జాలరుల జీవితాల నేపథ్యంగా ఈ కథ సాగుతుంది. చేపల వేటను జీవనాధారంగా సాగించే రాజు, తన ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలని ఆశపడతాడు. కానీ సముద్రపు విపత్తులు, అనూహ్య సంఘటనలు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అతని ప్రేమ, బాధ్యత మధ్య సంధిస్థలంగా ఉండే సత్య పాత్ర హృదయాన్ని హత్తుకుంటుంది. రాజు మిత్రులతో కలిసి చేపల వేటకు వెళ్లినపుడు, తెలియకుండానే పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించి జైల్లో…

Read More