తుళ్లూరులో క్యాన్సర్ ఆసుపత్రి విస్తరణపై బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ నేత, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. ఆసుపత్రి విస్తరణలో భాగంగా తుళ్లూరులో కొత్త క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆసుపత్రి నిర్మాణం వచ్చే 8 నెలల్లో పూర్తి అవుతుందని వెల్లడించారు. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలకృష్ణ శనివారం పీడియాట్రిక్ వార్డు, ఐసీయూను ప్రారంభించారు. క్యాన్సర్ బాధితులకు మెరుగైన చికిత్స అందించడానికి విస్తరణ పనులు చేపడుతున్నామని చెప్పారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కూడా…
