చిరు డ్యాన్స్ చూసి డ్యాన్సర్ అవ్వాలని అనుకున్నా – సాయి పల్లవి
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి చిరంజీవి డ్యాన్స్‌కి ఫిదా అయ్యానని, ఆయన డ్యాన్స్ చూసి తాను డ్యాన్సర్ అవ్వాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. చిరంజీవి నటించిన ‘ముఠా మేస్త్రి’ సినిమాను ఎన్నిసార్లు చూసినా తృప్తిపడేదాన్ని కాదని చెప్పారు. సాయి పల్లవి మాట్లాడుతూ, “చిన్నప్పుడు చిరంజీవి గారి డ్యాన్స్ చూసి నాకు డ్యాన్స్‌పై ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తితో వివిధ షోలలో పాల్గొన్నాను….
