ధోనీకి బాలీవుడ్ ఎంట్రీనా? కరణ్ జోహార్ హింట్!
బాలీవుడ్ స్టార్ దర్శకుడు కరణ్ జోహార్ ఓ ఆసక్తికర ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ త్వరలో రొమాంటిక్ పాత్రలో కనిపించబోతున్నారని వెల్లడించాడు. ఈ పోస్ట్‌తో అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. బాలీవుడ్‌లో తలా తెరంగేట్రం చేస్తున్నారా? అని నెట్టింట చర్చలు ఊపందుకున్నాయి. ఇన్‌స్టా స్టోరీలో కరణ్ జోహార్ పెట్టిన వీడియోలో ధోనీ చేతిలో లవ్ సింబల్ బెలూన్ ఉంది. క్యూట్‌గా చిరునవ్వుతో కనిపించిన ధోనీను చూస్తే ఓ సినిమా ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్టు అనిపిస్తోంది….
