
బాధితురాలితో పెళ్లయినా నిందితుడిపై కేసు రద్దుకు బాంబే హైకోర్టు నిరాకరణ
బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత బాధితురాలిని వివాహం చేసుకుని ఒక బిడ్డకు తండ్రి అయిన నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసును రద్దు చేయలేమని బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాధితురాలిని పెళ్లయినంత మాత్రాన నిందితుడిని చట్టబద్ధమైన చర్యల నుండి విముక్తి చేయడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, తనపై, తన కుటుంబంపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ 29 ఏళ్ల యువకుడు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు…